ప్రజలు కాంగ్రెస్‌కు పదేళ్లు పాలించే అవకాశం ఇస్తారని అనుకుంటున్నా : సీఎం రేవంత్‌రెడ్డి

2025-01-26 08:29:20.0

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరన్నిసీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు పదేళ్లు పాలించే అవకాశం ఇస్తారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహా విష్కరణలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నిన్న కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన పద్మ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని సీఎం తెలిపారు. తాము పంపిన పేర్లను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు ఇవ్వడాన్ని తాను..స్వాగతిస్తున్నానని ఇది అబినంధించాల్సి విషయమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు పేర్లను పరిగణలోకి తీసుకోకపోవడంపై త్వరలో కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు.

యూనివర్సిటీల నుంచి విద్యార్థి ఉద్యమకారులు, నాయకులు రావాలని పిలుపునిచ్చారు. అలాగే అంబేద్కర్ వర్సిటీలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు పాలించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇకపై అన్ని రెగ్యులర్ కాలేజీల పద్దతిలోనే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలను సేకరించి విలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని వేదికపైనే సీఎస్ కు సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయం అమలు అయితే ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో విద్యార్థులు ఓపెన్ డిగ్రీలు, పీజీలు పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy,FeeReimbursement,Ambedkar Open University,Padma Awards,Jubilee Hills,Telangana goverment,Mandakrishna Madiga,Congressparty