2025-03-02 09:05:34.0
కాంగ్రెస్ ప్రభుత్వం కళలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని, వాగ్గేయకారులు, కళాకారులను గౌరవిస్తుందన్న డిప్యూటీ సీఎం
కాంగ్రెస్ ప్రభుత్వం కళలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని, వాగ్గేయకారులు, కళాకారులను తమ ప్రభుత్వం గౌరవిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎల్బీ స్టేడియంలో శ్రీభక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొన్నారు. మంత్రి సీతక్క జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి వక్రమార్క, మంత్రులను సత్కరించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందని, దీనికి వసతులను సమకూరుస్తుంది అన్నారు. గత ప్రభుత్వం సినిమా కళాకారులకు ఇచ్చే నంది అవార్డులను పూర్తిగా విస్మరించింది. మా ప్రభుత్వం వచ్చాక కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఫిల్మ్ అవార్డులను అందించాలని నిర్ణయించింది. గద్దర్ లాంటి మహానుభావుడి పేరు మీద ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు’లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉగాది సందర్భంగా ఇవ్వడానికి నిర్ణయించిందన్నారు.
Deputy cm Bhattivikramarka Says,Gaddar awards,Ugadi,Sri Bhakta Ramdas birth anniversary celebrations