2024-11-21 04:32:03.0
కొవిడ్ సమయంలో అందించిన సహకారానికి ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’తో సత్కరించిన ఆ దేశ అధ్యక్షురాలు
https://www.teluguglobal.com/h-upload/2024/11/21/1379592-modi.webp
భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. గయానా అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్.. మోదీకి అందజేశారు. ప్రపంచ దేశాలకు ఆయన అందిస్తున్న సహాయ సహకారాలకు గాను ఈ గుర్తింపు లభించింది. ఈ అత్యున్నత పురస్కారం అందుకున్న నాలుగో విదేశీ నేత మోదీ కావడం గమనార్హం. ప్రస్తుతం గయానాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. ఆ దేశంతో 10 ఒప్పందాలు చేసుకున్నారు.
మరోవైపు కొవిడ్ సమయంలో తమ దేశానికి భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ..డొమినికా దేశ అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్.. ప్రధాని మోడీని నేడు ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’తో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని రెండు దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారాలను కోట్లాదిమంది భారతీయులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
Prime Minister Narendra Modi,Conferred,Guyana’s Highest National Award,Dr Irfaan Ali,Dominica’s Highest Award of Honour