2025-01-02 04:32:09.0
గాయకుడిపై ప్రధాని మోడీ ప్రశంసలు.. 2025 గొప్పగా ప్రారంభమైందన్న దిల్జిత్
https://www.teluguglobal.com/h-upload/2025/01/02/1390904-diljit-dosanjh.webp
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జిత్ దొసాంజ్ ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గాయకుడిపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. అతను ప్రజల హృదయాలను గెలిచాడని, దల్జిత్ అనే పేరును సార్థం చేసుకున్నాడని కొనియాడారు. దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియోను ప్రధాని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నుంచి తాను ఎంతగానో స్ఫూర్తి పొందానని గాయకుడు అన్నారు. ‘2025 గొప్పగా ప్రారంభమైంది. ప్రధానితో భేటీని ఎప్పటికీ మర్చిపోలేను’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
Punjabi actor-singer Diljit Dosanjh,Meets,PM Modi,‘A fantastic start to 2025’ Modi said,He’s truly multifaceted