ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

2025-02-26 05:53:54.0

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాద ఘటనను ప్రధానికి సీఎం వివరించినట్లు సమాచారం

ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాద ఘటనను ప్రధానికి సీఎం వివరించినట్లు తెలుస్తోంది. విభజన చట్టంలోని పెండింగ్‌ సమస్యలను మోడీ దృష్టికి సీఎం తీసుకువెళ్లినట్లు సమాచారం.రాష్ట్రానికి అన్నిరకాలుగా సాయం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి కేటాయింపులు లేవని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. పలు ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మూసీ నది ప్రక్షాళనకు కేంద్రం సహకరించాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణకు ఆర్థిక చేయాలని ప్రధానిని అభ్యర్థించారు.ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులను రేవంత్‌రెడ్డి కలిసే అవకాశం ఉన్నది. 

CM Revanth Reddy Met,PM Modi,Explain about SLBC Tunnel Collapse,Pending issues in AP Bifurcation Act,Central assistance for projects