ప్రధాని మోదీకి ఉక్కు మహిళ ఇందిరాకు పోలిక ఏంటి : టీపీసీసీ చీఫ్

2025-01-25 14:12:39.0

కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అనడానికి దావోస్ పెట్టుబడులే నిదర్శనమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు పీఎం అవాస్ యోజన పేరు పెట్టాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీకి, ఉక్కు మహిళ ఇందిరకు పొలిక ఏంటని ఆయన ప్రశ్నించారు. పేదల ఇళ్లకు ఇందిర పేరు పేడితే తప్పేంటని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఇందిరను అవమానించిన సంజయ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అనడానికి దావోస్ పెట్టుబడులే నిదర్శనమని ఆయన తెలిపారు.

బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రధానమంత్రిని గౌరవిస్తామని, దేశం కోసం ఇందిరమ్మ త్యాగం ముందు మీరు, నీ మోడీ ఎంత అని అన్నారు..ఇళ్ల పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని అన్నారు బండి సంజయ్. అలాగే కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు కూడా ఇవ్వమని, అవసరమైతే తాము ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు జారీ చేస్తామని సంజయ్ అన్నారు.

PM MODI,TPCC chief Mahesh Kumar Goud,Indira Gandhi,Ration card,Davos,Congress Goverment,Bandi Sanjay