ప్రధాని మోదీకి మెమొరీ లాస్‌!

2024-11-16 14:51:34.0

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

https://www.teluguglobal.com/h-upload/2024/11/16/1378455-modi-rahul.webp

ప్రధాని నరేంద్రమోదీకి మెమొరీ లాస్‌ అయ్యిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ మాదిరిగానే మోదీకి జ్ఞాపకశక్తి తగ్గిపోయినట్టు ఉందని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అమరావతిలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడుతూ రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య తాము ఏది మాట్లాడితే మోదీ కూడా అదే మాట్లాడుతున్నారని, బహుశా ఆయనకు జ్ఞాపకశక్తి నశించి ఉంటుందని అన్నారు. తన సోదరి ప్రియాంకా గాంధీ ఇటీవల ప్రధాని స్పీచ్‌ విన్నానని.. ఆ స్పీచ్‌ లో కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు మాట్లాడిన మాటలనే మోదీ కూడా చెప్పారని ఆమె తనతో వివరించారని తెలిపారు. అమెరికా పర్యటనకు జెలెన్‌ స్కీ వెళ్తే రష్యా ప్రెసిడెంట్‌ పుతిన్‌ వచ్చారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పారని, ఆయన లాగే మన ప్రధానికి కూడా మతి పోయినట్టు ఉందన్నారు.

PM Narendra Modi,Rahul Gandhi,Joe Biden,BJP,Congress,Memory Loss