ప్రధాని మోదీ క్వాస్ట్‌పై నిన్న చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ క్లారిటీ

2025-02-15 12:44:45.0

ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పానని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు

నిన్న ప్రధాని మోదీ క్వాస్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో సీఎం చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘తాను ప్రధాని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా దూషించలేదు. ప్రధాని హోదాను అగౌరవపర్చలేదు. పుట్టుకతోనే ఆయన బీసీ కాదు అని మాత్రమే చెప్పాను. మోదీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జన గణనలో కులగణన చేసి చూపించాలి’ అని డిమాండ్ చేశారు. అంతేకాదు.. తమ నాయకుడు రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. గ్యాప్ ఉన్నట్లు విపక్ష నేతలే క్రియేట్ చేశారని.. అవన్నీ ఊహాగానాలే అని అన్నారు. రాహుల్ గాంధీ గైడెన్స్‌తోనే పనిచేస్తున్నట్లు తెలిపారు.

రాహుల్ ఎజెండాను ముఖ్యమంత్రిగా నెరవేర్చడమే నా పని అని వెల్లడించారు. ఆయన పుట్టుకతో బీసీ కాదు కాబట్టే బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నట్లు తెలిపారు. కానీ తన వ్యాఖ్యలను కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగిన కుల గణన దేశానికి రోల్డ్ మోడల్ అన్నారు. కుల గణన ద్వారా ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నామని అన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్లుగా కచ్చితంగా చేస్తానని ఆయన అన్నారు. రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు రాలేదని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకువస్తామని ఆయన తెలిపారు .

PM Narendra Modi,CM Revanth Reddy,Rahul Gandhi,BC community leaders,Caste enumeration,Congress party,Kishan Reddy,Bandi Sanjay,KCR,KTR,BRS Party,BJP