ప్రధాని మోదీ బీసీ కాదు..సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

2025-02-14 12:19:21.0

ప్రధాని మోడీ బీసీ కాదని.. కన్వర్టెడ్ అని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

ప్రధాని మోదీ బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002 వరకు ఉన్నత వర్గాల్లో మోదీ ఉండేవాళ్లని.. మోదీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో కలిపారని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని మోదీ కులం గురించి ఆషామాషీగా చెప్పడం లేదు.. అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నానని అన్నారు. ఇక మీరే ఆలోచించుకోండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాం. పేదల ఆత్మగౌరవం కోసం ఇళ్లు కట్టిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల్లో యూత్‌ కాంగ్రెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇస్తాం. ఫ్లెక్సీలు కట్టి దండాలు పెట్టేవారికి పదవులు రావు. ఢిల్లీ నుంచి కాదు.. గల్లీ నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తాం. దేశంలోనే ఎవరూ చేయనంత రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి చేశామని సీఎం తెలిపారు.

Prime Minister Modi,CM Revanth Reddy,Gandhi Bhavan,Latest News,Telangana Congress,PM Modi Caste,BJP,BRS,KCR,KTR