https://www.teluguglobal.com/h-upload/2023/11/10/500x300_854378-eye-transplant.webp
2023-11-10 10:30:48.0
ఆధునిక వైద్యశాస్త్రం మరో ఘనత సాధించింది. నిన్న గాక మొన్న జన్యు మార్పిడి చేసిన ఒక పంది గుండెని ఓ వ్యక్తికి అమర్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి కన్ను మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు.
ఆధునిక వైద్యశాస్త్రం మరో ఘనత సాధించింది. నిన్న గాక మొన్న జన్యు మార్పిడి చేసిన ఒక పంది గుండెని ఓ వ్యక్తికి అమర్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి కన్ను మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. న్యూయార్క్‌లోని లాంగోన్‌హెల్త్ హాస్పిటల్ వైద్యులు ఈ ఘనత సాధించారు.
46 ఏళ్ల ఆరోన్ జేమ్స్ లైన్ వర్కర్ గా విధులు నిర్వహిస్తుండగా.. జూన్ 2021లో కరెంట్ షాక్ కి గురయ్యాడు. ఈ ప్రమాదంలో లైవ్ వైర్‌ను తాకి ఆయన ముఖం మొత్తం గుర్తుపట్టరానంతగా మారిపోయింది. ఎడమ కన్ను, మోచేయి పైన ముక్కు, పెదవులు, ముందు పళ్లు, ఎడమ చెంప, గడ్డం ఎముక వరకు సహా విస్తృతమైన గాయాలయ్యాయి. వెంటనే బాధితుడ్ని న్యూయార్క్‌లోని లాంగోన్ హెల్త్ ఆసుపత్రికి తరలించగా.. మే 27న అతడికి శస్త్రచికిత్స చేశారు.

ఓ దాత నుంచి కన్ను సేకరించి బాధితుడికి ఐ ట్రాన్స్ ప్లాంట్ చేశారు. కంప్లీట్ ఐ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినప్పటికీ రోగికి పూర్తిగా చూపు వస్తుందో లేదో తెలియదన్నారు. 21 గంటలపాటు జరిగిన ఈ సర్జరీ తరువాత మార్పిడి చేసిన ఎడమ కన్ను రెటీనాకు ప్రత్యక్ష రక్త ప్రసరణ సహా కాంతిని స్వీకరించడం, మెదడుకు చిత్రాలకు స్పందించడం వంటివి చేస్తోందన్నారు. అయినా సరే జేమ్స్ తన చూపును తిరిగి పొందుతాడని ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు. ప్రస్తుతం ఇంటికి చేరుకున్న అతడు నెలవారీ చెకప్‌ల కోసం ఆస్పత్రికి వస్తున్నాడని వైద్యులు తెలిపారు.
నిజానికి చాలా ఏళ్లుగా మొత్తం కంటిని మార్పిడిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అంధత్వాన్ని, దృష్టి లోపాలను సరిచేయడానికి కార్నియా మార్పిడి వంటి శస్త్రచికిత్సలు ఎన్ని చేస్తున్నా ఏకంగా పూర్తిగా కన్నును మార్చడం వైద్యుల సరికొత్త ఘనత అనే చెప్పాలి. ఈ ప్రయత్నంలో శాస్త్రవేత్తలు ఎలుకలలో కొంత విజయాన్ని సాధించినప్పటికీ అవి పాక్షిక దృష్టిని పొందాయి తప్ప పూర్తిగా చూపు రాలేదు. అయితే ఇంతకు ముందు మనుషులకు ఇలాంటి సర్జరీ నిర్వహించలేదు. ఈ శస్త్రచికిత్స భవిష్యత్తులో ఎన్నో నూతన ప్రయోగాలకు నాంది పలుకుతుందని వైద్యులు సైతం భావిస్తున్నారు.
Eyeball Transplant,Transplant,New York,Aaron James,Eye Transplant
Eyeball transplant, Eyeball, transplant, New York, human eyeball transplant, Aaron James, World first transplant of entire eye, Eye Transplant
https://www.teluguglobal.com//health-life-style/worlds-first-human-transplant-of-entire-eye-in-new-york-973497