ప్రపంచంలో క్రిస్టియన్‌లు చేస్తున్న సేవలు అభినందనీయం : సీఎం రేవంత్‌రెడ్డి

2024-12-21 15:45:41.0

దేశంలో సర్వ మతాలకు రక్షణ కల్పించడమే తెలంగాణ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

ప్రపంచంలో విద్యా, వైద్యరంగాల్లో క్రిస్టియన్ సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమైనవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ క్రిస్టియన్ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ శాఖ ఆద్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యధిక మంది నిర్వహించుకునే పండుగ క్రిస్మస్ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.అన్ని కులాలు, మతాలు సంప్రదాయాలను తమ ప్రభుత్వం గౌరవిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

క్రిస్మస్‌ను అధికార పండుగా రాష్ట్రమంతా నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ నెల ఈ మిరాకిల్ మంత్.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో పాటు, కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ అభిమానులకు ఎంతో ముఖ్యమైనదని అన్నారు. అలాగే ఏసు ప్రభువు ఇచ్చిన సందేశం లో అన్ని అంశాలు సంక్షిప్తమై ఉన్నాయని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి.. ప్రభుత్వం తో పోటీ పడి.. దేశానికి విద్యాను, వైద్యాన్ని క్రిస్టియన్ సంస్థలు అందించాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీఎం తో పాటు.. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర శాఖల ముఖ్య అధికారులు పాల్గోన్నారు. ఈ క్రమంలో మంత్రులు, క్రైస్తవ ప్రముఖులతో కలిసి.. క్రిస్మస్ ట్రీని వెలిగించారు.

CM Revanth Reddy,LB Stadium,Christmas celebrations,Ponnam Prabhakar,Ponguleti Srinivas Reddy,TPCC Chief Mahesh Kumar Goud,Christian Corporation,Minority Corporation Branch