2024-11-30 08:51:01.0
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఇస్కాన్ కోల్‌కతా అధికార ప్రతినిధి రాధారమణ్‌దాస్
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగిన వేళ ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలకు ఇస్కాన్ పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్ మైనారిటీల భద్రతను కాంక్షిస్తూ డిసెంబర్ 1న ‘ప్రార్థన జపం’ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించింది. రేపు అన్ని ఇస్కాన్ ఆలయాల్లో ప్రార్థనలు చేయాలని భక్తులకు పిలుపునిచ్చింది. 150 దేశాల్లోని అనేక నగరాల్లో లక్షలాది మంది భక్తులు బంగ్లాదేశ్ మైనారిటీలు, హిందువుల భద్రత కోసం ప్రార్థనలు చేయడానికి ఏకం కానున్నారు. అందరూ తమ కార్యాలయాల్లో జరిగే సమ్మేళనంలో పాల్గొనాలని ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధా రామణ్ దాస్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. శుక్రవారం బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్‌లో వందలాదిమంది ఆందోళనకారులు మూడు హిందు దేవాలయాలపై దాడికి పాల్పడ్డారు. ఆలయాలను ధ్వంసం చేయడానికి యత్నించారు. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారంటూ చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్టు చేయడంతో ఆ దేశంలో తాజా ఉద్రిక్తతలుకు దారితీసింది.
ISKCON,Observe prayers worldwide,On December 1,Amid attacks,On Bangladesh Hindus