2016-03-02 01:28:46.0
పశ్చిమ బెంగాల్‌కి చెందిన సతాపర్ణ ముఖర్జీ అరుదైన ఘనతని సాధించింది. 12వ తరగతి విద్యార్థిని అయిన ఈమె అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) అందిస్తున్న ప్రతిష్టాత్మకమైన గొడ్డార్డ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం (జిఐపి)కి ఎంపికైంది. ఈ ప్రోగ్రాం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేయబడిన అయిదుగురు స్కాలర్లలో ఈమె ఒకరు. గొడ్డార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ సంస్థ ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తుంది. సతాపర్ణ ముఖర్జీ కోల్‌కతాకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామానికి […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/03/women.png
పశ్చిమ బెంగాల్‌కి చెందిన సతాపర్ణ ముఖర్జీ అరుదైన ఘనతని సాధించింది. 12వ తరగతి విద్యార్థిని అయిన ఈమె అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) అందిస్తున్న ప్రతిష్టాత్మకమైన గొడ్డార్డ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం (జిఐపి)కి ఎంపికైంది. ఈ ప్రోగ్రాం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేయబడిన అయిదుగురు స్కాలర్లలో ఈమె ఒకరు. గొడ్డార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ సంస్థ ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తుంది. సతాపర్ణ ముఖర్జీ కోల్‌కతాకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామానికి చెందిన అమ్మాయి.
నాసా జిఐపి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఇలా అయిదుగురు విద్యార్థులను ఎంపిక చేసి వారి చదువుకి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూరస్తుంది. ఈ అవకాశంతో సతాపర్ణ లండన్లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో, లండన్ ఆస్ట్రోబయాలజీ సెంటర్‌లో (నాసా విభాగంలో) గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎరో స్పేస్ ఇంజినీరింగ్‌లో పిహెచ్‌డి పూర్తి చేస్తుంది.
తనకు ఈ అరుదైన అవకాశం ఎలా దక్కింది… అనే విషయంపై స్పందించిన సతాపర్ణ, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో ఒక గ్రూపులో సభ్యురాలైన తాను, గత ఏడాది మేలో బ్లాక్ హోల్ థియరీపై తన ఆలోచనలు తెలిపానని పేర్కొంది. ఆమె చెబుతున్న వివరాల ప్రకారం -అందులో సైంటిస్టులు కూడా సభ్యులుగా ఉన్నారు. వారిలో ఒకరు నాసా అధికారిక వెబ్‌సైట్ గురించి చెప్పి అందులో ఆమె భావాలను పోస్ట్ చేయాల్సిందిగా చెప్పారు. ఆమె అలాగే చేసింది. బైమ్ మెషిన్ తయారీలో బ్లాక్‌హోల్ థియరీ ఎలా ఉపయోగపడుతుంది…అనే అంశంమీద ఆమె వెల్లడించిన అభిప్రాయాలకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. దాంతో ఆమెకు ఈ అరుదైన అవకాశం లభించింది. గొడ్డార్డ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంతో సతాపర్ణ లండన్‌లోని నాసా సెంటర్లో పరిశోధకురాలిగానూ, ఉద్యోగిగానూ పనిచేయబోతోంది. నాసా ఆమె ఖర్చులన్నింటినీ భరించడంతో పాటు కొంతమొత్తాన్ని పారితోషకంగా కూడా చెల్లిస్తుంది. సతాపర్ణ తండ్రి ప్రదీప్ ముఖర్జీ ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. తమ కుమార్తె తమనే కాక, దేశాన్నే గర్వపడేలా చేసిందన్నారు ఆయన. సతాపర్ణ ఆగస్టు 17న లండన్ వెళ్లబోతోంది.