2024-10-18 07:46:11.0
ఈ వృద్ధిలో మెజారిటీ పాత్ర దేశీ మార్కెట్లదేనని, ఆరోగ్యకరమైన వాతావరణానికి ఇది సూచిక అన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా
ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర గురించి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వృద్ధిరేటు మెరుగ్గా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. భారత్ వృద్ధి రేటు పెరుగుదలలో మెజారిటీ పాత్ర దేశీయ మార్కెట్లదేనని.. ఆరోగ్యకరమైన వాతావరణానికి ఇది సూచిక అని తెలిపారు. త్వరలో నిర్వహించనున్న ప్రపంచబ్యాంకు అంతర్జాతీయ వార్షిక సమావేశానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే దేశ ప్రజల జీవన నాణ్యత, పరిశుభ్రమైన గాలి, నీటి లభ్యత గురించి భారత్ చర్యలు చేపట్టాలని అజయ్ బంగా సూచించారు.భవిష్యత్తులో ఈ అంశాలపై భారత్ మరిన్ని ప్రాజెక్టులు రూపొందించాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్థికవృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని భారత్ మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశాల సుస్థిరాభివృద్ధికి ప్రపంచబ్యాంకు మద్దతు ఇస్తుందన్నారు.
India’s growth rate,shiniest,world economy,Ajay Banga