2025-01-11 07:12:16.0
https://www.teluguglobal.com/h-upload/2025/01/11/1393549-prabhas.webp
గణపవరానికి చెందిన అమ్మాయిని అతను పెళ్లి చేసుకోనున్నారని ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోలో హీరో రామ్‌చరణ్ హింట్
బాహుబలి హీరో ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ వయసు హీరోలంతా పెళ్లిల్లు ఎప్పుడో అయిపోవడంతో ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? వధువు ఎవరు అనే దానిపై చర్చ జరుగుతూనే ఉన్నది. అంతేకాదు ఆయన వివాహం చేసుకోబోయేది ఈమేనంటూ ఇప్పటికే ఎన్నోపేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పెళ్లిని ఉద్దేశించి ఆయన స్నేహితుడు, నటుడు రామ్ చరణ్ ఆసక్తికర విషయాన్ని బైటపెట్టినట్లు సమాచారం. ఆయన ఎవరిని పెళ్లి చేసుకోనన్నారనే విషయాన్ని అన్‌స్టాపబుల్ కార్యక్రమంలో చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నంచగా.. రామ్‌చరణ్ నవ్వుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని గణపవరానికి చెందిన అమ్మాయిని అతను పెళ్లి చేసుకోనున్నారని చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానున్నది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్‌చరన్ ఈ కార్యక్రమంలో సందడి చేసిన విషయం విదితమే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన మొదటి భాగం జనవరి 8న విడుదలైంది. ఇందులో చరణ్ అనేక విషయాలు పంచుకున్నారు. తన తండ్రి చిరంజీవితో పాటు బాబాయిలు నాగబాబు, పవన్ కల్యాణ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. అలాగే వాళ్ల నానమ్మ వంట తనకు ఎందుకు ఇష్టమో చెప్పారు. అలాగే తన స్నేహితుడు శర్వానంద్ కూడా ఈ ఎపిసోడ్‌లో పాల్గొని వాళ్ల ఫ్రెండ్‌షిప్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న సంగతి తెలిసిందే.
Prabhas’ Marriage,Ram Charan Drops,Major Hint,On Unstoppable Show,Nandamuri Balakrishna,Ganapavaram,West Godavari district