ప్రభాస్ పోస్ట్‌ వైరల్‌.. ఆ హీరోయిన్‌తోనే పెళ్లి..!

 

2024-05-17 07:26:23.0

https://www.teluguglobal.com/h-upload/2024/05/17/1328310-prabhas-marriage.webp

” డార్లింగ్స్.. మన జీవితాల్లోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి” అంటూ ఇన్‌స్టాలో ప్రభాస్ పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతోంది.

” డార్లింగ్స్.. మన జీవితాల్లోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి” అంటూ ఇన్‌స్టాలో ప్రభాస్ పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ పెళ్లి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సినిమాల గురించి అయితే పర్సనల్ టచ్ ఉండదు. దీంతో ప్రభాస్‌ తనకు కాబోయే భార్యను పరిచయం చేయబోతున్నాడనే చర్చ జరుగుతోంది.

 

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. ప్రభాస్‌కు ప్రస్తుతం 44ఏళ్లు. డార్లింగ్ పెళ్లికోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. గతంలో కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టితో ప్రభాస్ లవ్‌లో ఉన్నాడని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వార్తలొచ్చాయి. కానీ అదేం జరగలేదు.

అనుష్క ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంపై హాట్‌హాట్‌ డిస్కషన్‌ నడుస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే ఆదిపురుష్ బ్యూటీ కృతిసనన్‌తోనూ ప్రభాస్ ప్రేమలో పడ్డాడనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు?, ఎవరితో? అనేది ఆసక్తికరంగా మారింది.

 

Prabhas Marriage,Prabhas,Instagram,Tollywood