2024-12-22 07:59:29.0
https://www.teluguglobal.com/h-upload/2024/12/22/1388132-narayana.webp
పుష్ప2 సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసుకోవాలని సందేశం ఇస్తున్నదా? అని సీపీఐ నేత నారాయణ ప్రశ్న
పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా దారుణమని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని.. తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వ అనుమతి ఇవ్వడం నారాయణ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
పుష్ప2 సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసుకోవాలని సందేశం ఇస్తున్నదా? స్మగ్లింగ్‌తో పాటు అసభ్యకరమైన పాటలు అందులో పెట్టారు. ప్రభుత్వం సిగ్గులేకుండా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అదేమన్నా సమాజానికి ఉపయోగపడే సినిమానా? ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలి. దీనిలో పోలీసుల తప్పేం లేదు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండటానికి సినిమా వర్గాలు, కళాకారులు, రాజకీయ నేతలు చర్యలు చేపట్టాలి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. త్వరలో మా వంత సాయం ప్రకటిస్తామని నారాయణ తెలిపారు.
CPI Leader Narayana,Criticize,Revanth Reddy govt,Shamelessly allowed,Pushpa 2,Ticket rates to increase