2024-10-14 18:40:29.0
మద్యం షాపుల్లో వాటాల కోసం షాపులు పొందిన వారికి ఇబ్బందులు సృష్టిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరిక
https://www.teluguglobal.com/h-upload/2024/10/14/1368951-ap-cm.webp
లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వారిని పలుచోట్ల వాటాల కోసం బెదిరించారనే వార్తలను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. ఏఏ ప్రాంతాల్లో ఎవరు ఏ తరహా బెదిరింపులకు పాల్పడ్డారన్నది సీఎం చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ యంత్రాంగం, ఇంటలిజెన్స్, ఆబ్కారీ శాఖ ద్వారా సమాచారాన్ని సీఎం ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. మద్యం షాపుల్లో వాటాల కోసం షాపులు పొందిన వారికి ఇబ్బందులు సృష్టిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటికే పలువురు నేతలకు పార్టీ హైకమాండ్ హెచ్చరికలు పంపినట్లు సమాచారం. మద్యం, ఇసుక విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతీ ఒక్కరూ కట్టబడి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారు ఎవరైనా సరే అంగీకరించేది లేదన్నారు. షాపులు పొందిన వాళ్లు స్వేచ్ఛగా, నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.