http://www.teluguglobal.com/wp-content/uploads/2016/08/government-hospitals.jpg
2016-08-09 03:15:20.0
మనదేశంలో ఉన్న వైద్య సదుపాయాలను తేటతెల్లం చేస్తున్న లెక్కలు ఇవి. దేశం మొత్తంమీద గవర్నమెంటు ఆసుపత్రుల్లో 7.5 లక్షల బెడ్‌లు ఉన్నాయి. అంటే దేశజనాభాని బట్టి చూస్తే ప్రతి వెయ్యిమందికి ఒక్క బెడ్ కూడా లేనట్టు లెక్క. ప్రతి వెయ్యి మందికి 0.6 బెడ్ అందుబాటులో ఉంది. ప్రతి వెయ్యిమందికి ఒకటి కంటే ఎక్కువగా బెడ్లు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో (అదీ 3.8లోపే) లక్ష్యదీప్, పుదుచ్చేరి, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల ప్రదేశ్, గోవా, త్రిపుర, […]
మనదేశంలో ఉన్న వైద్య సదుపాయాలను తేటతెల్లం చేస్తున్న లెక్కలు ఇవి. దేశం మొత్తంమీద గవర్నమెంటు ఆసుపత్రుల్లో 7.5 లక్షల బెడ్‌లు ఉన్నాయి. అంటే దేశజనాభాని బట్టి చూస్తే ప్రతి వెయ్యిమందికి ఒక్క బెడ్ కూడా లేనట్టు లెక్క. ప్రతి వెయ్యి మందికి 0.6 బెడ్ అందుబాటులో ఉంది. ప్రతి వెయ్యిమందికి ఒకటి కంటే ఎక్కువగా బెడ్లు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో (అదీ 3.8లోపే) లక్ష్యదీప్, పుదుచ్చేరి, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల ప్రదేశ్, గోవా, త్రిపుర, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, ఢిల్లీ ఉన్నాయి. ఇక వెయ్యిమంది జనాభాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క బెడ్ కూడా లేని రాష్ట్రాల్లో ఒడిషా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్లు ఉన్నాయి. దేశ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ఆధారంగా వెల్లడైన నిజాలు ఇవి. బీహార్లో అత్యల్పంగా ప్రతి పదివేల మందికి ఒక బెడ్ అందుబాటులో ఉంది.
Click on Image to Read:
government hospital beds,Ministry of Health and Family Welfare,national health welfare,survey
https://www.teluguglobal.com//2016/08/09/survey-on-government-hospital-beds/