ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్ మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం

2025-02-05 07:19:02.0

ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు, పద్మ విభూషణ్‌ గ్రహీత ఆగాఖాన్‌‌‌ కన్నుమూశారు.

ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు పద్మ విభూషణ్‌ గ్రహీత ఆగాఖాన్‌‌‌ తుది శ్వాస విడిచారు. ఆగాఖాన్ మృతి చెందిన విషయాన్ని ఆగాఖాన్ ఫౌండేషన్ తెలిపింది. పోర్చుగల్‌లోని లిస్బన్‌లో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. బ్రిటన్‌ పౌరసత్వం కలిగిన ఆగాఖాన్ స్విట్జర్‌ల్యాండ్‌లో జన్మించారు. 20 ఏళ్ల వయస్సుల్లోనే 1957లో ఇస్మాయిలీ ముస్లింల 49వ వంశపారంపర్య ఇమామ్‌గా ఆగాఖాన్ నియమితులయ్యారు.1967లో ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ను స్థాపించారు.

ఇది ప్రంచంలోనే వందలాది ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేసింది. ఆగాఖాన్ నెట్ వర్క్ ద్వారా వివిధ దేశాల్లో ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను నెలకొల్పి మానవాళికి సేవలందించారు. ఆయన సేవలకు గాను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించిందిఅగాఖాన్ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ మరణం మానవళాకి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు.

Aga Khan,CM Revanth Reddy,Aga Khan Foundation,Aga Khan Network,Portugal,Padma Vibhushan. PM MODI,Telangana goverment