ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఆస్తులు జప్తు ఎందుకంటే?

2025-02-20 15:57:49.0

ప్రముఖ డైరెక్టర్ శంకర్ రూ.10.11 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

ప్రముఖ దర్శకుడు శంకర్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ దశలో ఉండగా శంకర్‌కు చెందిన రూ.10.11 కోట్ల విలువైన ఆయన ఆస్తులను జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద డైరెక్టర్ శంకర్ కు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసినట్లు ప్రకటించింది. రోబో సినిమా కోసం రూ.11.5 కోట్ల కొట్ల రెమ్యూనరేషన్‌ను శంకర్ తీసుకున్నారని వెల్లడించింది. 2022లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అతనికి నోటీసు పంపారు.

ఆ సమయంలో, అతను తన న్యాయవాదితో వచ్చి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ముందు 3 గంటల పాటు హాజరై వివరణ ఇచ్చాడు. ఆ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. ఈ విషయం సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది.శంకర్ తమిళ సినిమాలో భారీ బడ్జెట్ చిత్రాలకు డైరెక్షన్ వహించిన దర్శకుడే కాదు, ఇండియన్, జీన్స్, జెంటిల్‌మన్, బాయ్స్, 2.0, స్ట్రేంజర్, గేమ్‌ఛేంజర్ వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Director Shankar,ED,Enforcement Directorate,Anti-Money Laundering Act,Robot movie,Indian,Jeans,Gentleman,Boys,moviesRemuneration