ప్రశ్న

2022-11-24 06:44:54.0

https://www.teluguglobal.com/h-upload/2022/11/24/427683-prasna.webp

ప్రశ్న…ప్రశ్న…ప్రశ్న

ఎదుగుదలకు ఆయుధం

ప్రకృతి ఇచ్చిన చరణాకోల

ప్రకృతి హృదయావిష్కరణ

ప్రయోగం

ప్రశ్నతోనే ప్రకృతి రహస్యం

బట్ట బయలు

ప్రకృతివిశ్వరూప సాక్షాత్కారానికితోవ

బతుకుకు విలువలనేర్పే బాట

ప్రశ్న ఎదుగుదలకు పురస్కారం

సమస్యకు పరిష్కారం

ముందడుగుకు వేసే అడుగు

ప్రశ్నంటే మాటల వామనుడు కాదు

వామనత్వంలో దాక్కున్న విశ్వరూపం

ఆంతర్యాలను విప్పిచూపి

అనుభవాలను ఎత్తి చూపి

అజ్ఞానాన్నినిలదీసి మాయంచేసి

వివేచనకు పీటవేసి

సందర్భవిభక్తులకు

ప్రత్యయంగా ఉండి

విషయ స్వరూపాన్నితెలిపే

వ్యాకరణం ప్రశ్న

విజ్ఞానానికి ఊపిరి

అజ్ఞానాన్ని పేల్చేసే బాంబు

విజ్ఞానాన్నివిస్తరించి

ప్రజ్ఞానాన్నిప్రకటించేసాంకేతికత

ప్రశ్న పకృతిని విస్తరిస్తుంది

పరిణామ శకలాలను

గుర్తించిఒకటిగాచేసి

విజ్ఞానరూపాన్ని మనసుకు చూపిస్తుంది

రెండక్షరాలదేకానీ

సమస్తవిజ్ఞాన వాచక సారథి

ప్రశ్నలేకుంటే ప్రపంచంలేదు

ప్రశ్నతోనేప్రగతి

ప్రశ్నతోనే మనుగడవికాసం

ప్రశ్న నాగరికతకుమూలం

ప్రశ్నను ఆహ్వానించు

ప్రేమించు

ప్రశ్న తో చెట్టపట్టాలుకట్టి

మానవతా ప్రపంచంలో జీవించు

 -వల్లభాపురంజనార్దన

Vallabhapuram Janardhana,Telugu Kathalu,Telugu Kavithalu,Telugu Poets