ప్రియాంక.. రాహుల్‌లా కాదు

 

2025-01-09 07:23:07.0

https://www.teluguglobal.com/h-upload/2025/01/09/1392907-kangana.webp

రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలో తాను గమనించిన విషయాలను వెల్లడించిన కంగనా రనౌత్‌

కాంగ్రెస్‌ అగ్రనాయకులు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలో తాను గమనించిన విషయాలను నటి కంగనా రనౌత్‌ వెల్లడించారు. తాను నటించిన ఎమర్జెన్సీ సినిమాను చూడాలని ఈ ఇద్దరు నేతలను కంగన కలిసిన విషయం విదితమే.

మొదటి నుంచి రాహుల్‌ గాంధీని కంగన విమర్శిస్తూనే ఉన్నారు. ఇక తన సినిమాను చూడటానికి రాహుల్‌ను ఆహ్వానించడానికి వెళ్తే ఆయన అంత మర్యాదగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు. అదే ప్రియాంక విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె చిరునవ్వుతో పలకరించి మాట్లాడారు. ఆ సంభాషణ నాకు గుర్తుండిపోతుంది. ఆమె తన సోదరుడిలా కాదు. తెలివైనది. ప్రియాంకతో మాట్లాడటాన్ని నేను ఎంజాయ్‌ చేశాను అని మీడియాతో మాట్లాడారు.

ఇంతకుముందు కూడా ఇదే విషయంపై కంగన మాట్లాడిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ప్రియాంకను కలిసినప్పుడు మా ఎమర్జెన్సీ మూవీని తప్పకుండా చూడాలని కోరగా, ప్రయత్నిస్తానని ఆమె సమాధానం ఇచ్చారు. ఈ సినిమా ఆమెకు తప్పకుండా నచ్చుతుందని తెలియజేశాను. ఎమర్జెన్సీ అనేది ఎంతో సున్నితమైన అంశం. ఇందిరాగాంధీ పాత్రను ఎంతో మర్యాదపూర్వకంగా చూపించాను. రీసెర్ఛ్ సమయంలో ఎన్నో విషయాలను గ్రహించాను. ఇందిరాగాంధీకి తన భర్త, పిల్లలు, స్నేహితులతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకున్నాను. శత్రువులతో ఎలా వ్యవహరించేవారో అర్థం చేసుకున్నాను. ఆ విషయాలన ఎక్కడా టచ్‌ చేయకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని కంగన తెలిపారు. తాజాగా ఆ పార్లమెంట్‌ సంభాషణనే మరోసారి ప్రస్తావించారు. 

 

Kangana Ranaut praised,Priyanka Gandhi,Courteous,Rahul smirked,Emergency Movie,Based on Indira Gandhi