https://www.teluguglobal.com/h-upload/2025/01/13/1394131-tgtd.webp
2025-01-13 11:27:23.0
నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణాశాఖ కొరడా ఝుళిపించిన రవాణాశాఖ
సంక్రాంతి నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణాశాఖ కొరడా ఝుళిపించింది. గత నాలుగురోజులుగా రవాణాశాఖ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో 12 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్, ఆరాంఘర్ వద్ద తనిఖీల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై 300లకు పైగా కేసులు నమోదు చేసినట్లు రవాణాశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఇష్టారాజ్యంగా ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని.. ఆ నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు. వీటితోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.
Telangana Transport department,Booked 300 cases against private bus operators,Charging high fares,Violating rules.