2025-02-01 11:21:38.0
బడ్జెట్ నేపథ్యంలో రోజంతా లాభ-నష్టాల మధ్య కదలాడి చివరికి ప్లాట్‌గా ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ప్లాట్ గా ముగిశాయి. బడ్జెట్ నేపథ్యంలో ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. రోజంతా లాభ-నష్టాల మధ్య కదలాడిన సూచీలు చివరకు ప్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 5 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
సెన్సెక్స్ ఉదయం 77,637.01 వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. బడ్జెట్ నేపథ్యంలో తీవ్ర ఊగిసలాటకు లోనైంది. ఇంట్రాడేలో 77,006.47 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 5 పాయింట్ల లాభంతో 77,505.96 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించి 23,482 వద్ధ స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, ఐటీసీ హోటల్స్, మారుతీ సుజుకీ, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, టైటాన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎల్‌అండ్‌టీ, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టపోయాయి.
Nifty,BSE Sensex,Union Budget,Company LTP (₹) Chg (₹) Chg(%),Maruti Suzuki,Bajaj Finance