https://www.teluguglobal.com/h-upload/2024/10/16/1369591-murder.webp
2024-10-16 10:39:03.0
రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ గ్రామంలో మనోహర్ రావు ఫామ్ హౌస్ లో బుధవారం వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు.
రంగారెడ్డి జిల్లా ఓ పామ్‌హౌస్‌లో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ గ్రామంలో మనోహర్ రావు ఫామ్ హౌస్‌లో నాగర్ కర్నూలు జిల్లా ముష్టిపల్లికి చెందిన ఉషయ్య (70), శాంతమ్మ (65) దంపతులు రెండు సంవత్సరాల నుంచి పొలంలో కాపలదారులుగా పనిచేస్తున్నారు. నిన్న సాయంత్రం యజమాని ఉషయ్యతో ఫోన్ మాట్లాడాడు.
బుధవారం ఉదయం 9 గంటల సమయంలో మనోహర్ రావు ఉషయ్యకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవడంతో మనోహర్ రావు తనకు తెలిసిన వ్యక్తిని వ్యవసాయ క్షేత్రాన్నికి దగ్గరకి వెళ్లి చూడమన్నాడు. అప్పటికే శాంతమ్మ, ఉషయ్యలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతునికి ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
Ranga Reddy District,farmhouse,murder of couple,Kothaguda village,Mushtipalli,Manohar Rao