ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన అర్వింద్‌కుమార్‌

https://www.teluguglobal.com/h-upload/2025/01/09/1392895-aravind-kumar.webp

2025-01-09 06:46:34.0

నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్‌ఈవో సంస్థకు నగదు బదిలీపై ప్రశ్నించనున్న దర్యాప్తు సంస్థ

ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ హాజరయ్యారు. బషీర్‌బాగ్‌ ఈడీ కార్యాలయానికి ఆయన వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో) సంస్థకు రూ. 45.71 కోట్ల బదిలీపై అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌ జరిగినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలో అర్వింద్‌కుమార్‌ను విచారిస్తున్నట్లు సమాచారం. 

IAS Arvind Kumar,Attends,ED Enquiry,Formula E Race case,ACB case,KTR