2024-12-20 10:42:26.0
ఫార్ములా ఈ- కార్ రేసుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించాలన్న బీఆర్‌ఎస్ డిమాండ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.
ఫార్ములా ఈ- కార్ రేసుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించాలన్న బీఆర్‌ఎస్ డిమాండ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఎక్కడైనా చర్చకు సిద్దం. మేం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులను తాను కలిశారని.. కేటీఆర్ తో చీకటి ఒప్పందం ఉందని వాళ్లే తనకు చెప్పారని ముఖ్యమంత్రి అన్నారు. వాళ్లని కలిసిన తర్వాతే ఈ స్కామ్ గురించి తెలిసిందన్నారు. వీళ్ళ మధ్య 600 కోట్లకు ఒప్పందం జరిగిందని.. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ ఆర్థిక నేరాన్ని 55 కోట్లకే ఆపామన్నారు.
ఫార్ములా ఈ – రేస్ పై చర్చకు తాము సిద్దమని.. అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీస్ కి కూడా వెళతానని అన్నారు రేవంత్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎంతోమంది నిపుణులు, మేధావులు, రైతు నేతలతో చర్చించి ధరణిని రద్దు చేశామని వెల్లడించారు. భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ధరణి పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక ఫార్ములా ఈ – రేస్ పై స్పందించిన సీఎం రేవంత్.. దీనిపై బీఎసీలో ఎందుకు చర్చించలేదన్నారు.
Telangana Assembly,Formula E is car racing,KCR,BRS Party,Harish Rao,CM Revanth reddy,Congress party,KTR,FEO Company