ఫిబ్రవరిలో ప్రధాని మోడీ అమెరికా పర్యటన

2025-01-28 06:12:32.0

ఈ విషయాన్ని వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

ప్రధాని నరేంద్రమోడీ వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో అమెరికాకు ప్రధాని మోడీ వచ్చే అవకాశం ఉన్నదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. సోమవారం ప్రధాని మోడీతో పలు అంశాలపై చాలాసేపు మాట్లాడినట్లు మీడియాతో ట్రంప్‌ పేర్కొన్నారు. భారత్‌తో అమెరికాకు మంచి సంబంధాలున్నాయని ఈ సందర్భంగా చెప్పారు. గతంలో ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2019లో హ్యూస్టన్ లో జరిగిన కార్యక్రమానికి మోడీ హాజరై మాట్లాడారు. ఆ తర్వాత 2020లో భారత్‌కు వచ్చిన ట్రంప్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రసంగించారు. ఇటీవల ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన సమయంలో ఆయనకు ఫోన్‌ చేసి ప్రధాని అభినందనలు తెలిపారు.

Donald Trump says,PM Narendra Modi,Likely to visit US,In February