2025-02-02 16:03:46.0
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
ఫిబ్రవరి 15 లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటిచిన ఆయ ఎన్నికలు వస్తున్నాయ్.. జాగ్రత్త అంటూ కార్యకర్తలకు సూచించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర కుటుంబ సర్వేపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చింది. ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామంటూ పంచాయతీరాజ్, ఎన్నికల సంఘం అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది. కులగణన నివేదిక కేబినెట్ సబ్ కమిటీకి ఆదివారం అందింది. దీనిపై కేబినెట్‌లో చర్చించిన తర్వాత 5న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. కేంద్ర ప్రభుత్వానికి పంపించే వీలున్నది. కేంద్రం స్పందన ఎలా ఉన్నా .. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు వెళ్లాలనే కార్యాచరణతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Revenue Minister Ponguleti Srinivas Reddy,said that,Panchayat elections scheduled,By February 15th,Notification for Sarpanch Elections