ఫెస్టివల్ సేల్‌లో డబ్బు ఆదా చేసే టిప్స్!

https://www.teluguglobal.com/h-upload/2022/09/21/500x300_401951-saving.webp
2022-09-21 10:43:58.0

ఈ నెల 23 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్, బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్స్ మొదలవ్వబోతున్నాయి. ఈ సేల్‌లో మరింత డబ్బు ఆదా చేయాలనుకుంటే ముందుగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

ఈ నెల 23 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్, బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్స్ మొదలవ్వబోతున్నాయి. ఈ సేల్‌లో మరింత డబ్బు ఆదా చేయాలనుకుంటే ముందుగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే..

సేల్‌లో ఎక్కువ బెనిఫిట్స్‌ పొందాలంటే ఆయా సంస్థల మెంబర్‌‌షిప్‌ను తీసుకోవాలి. ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్’ మెంబర్ షిప్, ‘అమేజాన్ ప్రైమ్’ వంటి మెంబర్‌‌షిప్‌లు ఉన్న యూజర్లకు సేల్ ముందుగానే అందుబాటులోకి వస్తుంది. అలాగే డెలివరీ ఛార్జీల్లో తగ్గింపు ఉంటుంది.

సేల్‌లో అసలైన ఆఫర్లు పొందాలంటే ముందుగా యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. అలాగే ఆర్డర్‌ చేయబోయే ముందే మీ ప్రాంతం పిన్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.

ఇలాంటి సేల్స్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఒకవేళ మొబైల్ మార్చాలి అనుకుంటే పాత మొబైల్‌ను ఎక్స్‌చేంజ్‌కు పెట్టొచ్చు. ఇలాంటి సేల్స్‌లో ఎక్స్‌చేంజ్‌కు ఎక్కువ ధర ఇస్తారు. అలాగే వస్తువులు కొనేటప్పుడు కచ్చితంగా రిటర్న్‌, ఎక్స్‌చేంజ్ పాలసీలను ముందే పూర్తిగా చదవాలి.

ఫెస్టివల్స్ సేల్స్‌లో క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎక్కువ ఆఫర్లు ఉంటాయి. అందుకే కొనుగోలు చేసేముందు ఏయే కార్డుపై ఎంత రాయితీ ఉందో తెలుసుకుని ఆయా కార్డ్స్‌ను వాడేలా చూసుకోవాలి. కార్డు లేకపోతే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ సాయం తీసుకోవచ్చు.

సేల్ జరిగే రోజుల్లో ఆఫర్ల వివరాలను పోస్ట్ చేసే సోషల్‌ మీడియా పేజీలను ఫాలో అవ్వడం ద్వారా అట్రాక్టివ్ ఆఫర్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఫ్లాష్ సేల్స్ అప్‌డేట్స్‌ లాంటివి పొందొచ్చు.

ఒక వస్తువు కొనేముందు దాన్ని రెండు ఈకామర్స్ సైట్స్‌లో చెక్ చేయాలి. ప్రొడక్ట్ రిలీజ్ డేట్, సెల్లర్ డీటెయిల్స్, ఆఫర్, డిస్కౌంట్.. ఈ వివరాలన్నీ చెక్ చేసుకుని మంచి ప్రొడక్ట్ ఎందులో ఉంటే అందులో కొనుగోలు చేయాలి.

ఇకపోతే సేల్‌లో కొన్ని మొబైల్స్‌ను ఫ్లాష్ సేల్ ద్వారా కొనాల్సి ఉంటుంది. ఈ ఫ్లాష్‌ సేల్‌లో లిమిటెడ్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. అందుకే ప్రొడక్ట్‌ను కార్ట్‌లో యాడ్ చేసి పేమెంట్ చేసే లోపే ‘అవుట్ ఆఫ్ స్టాక్’ అని వస్తుంది. అందుకే ఇలాంటి ఫ్లాష్ సేల్స్‌లో మొబైల్ కొనాలంటే పేమెంట్ ప్రాసెస్ లేట్ అవ్వకుండా చూసుకోవాలి. దానికోసం బ్యాంకు/కార్డు వివరాలను ముందే సేవ్‌ చేసి పెట్టుకోవాలి.

అన్నింటికంటే ముఖ్యంగా ఎక్కువ ఆఫర్ ఉంది కదా అని తొందరపడి కొనేయకుండా నిజంగా దాని అవసరం ఉందో, లేదో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.

Amazon Great Indian Festival Sale,Flipkart Big Billion Days,Money Saving Tips
amazon great indian festival, amazon great indian festival sale, amazon great indian festival sale 2022, amazon, flipkart big billion days, save money, Save Money tips, Money Saving Tips

https://www.teluguglobal.com//business/tips-to-save-money-in-amazon-and-flipkart-festival-sale-344963