https://www.teluguglobal.com/h-upload/2023/10/05/500x300_835679-shoping-offers.webp
2023-10-05 08:49:24.0
రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఇ–కామర్స్ సంస్థలు ఫెస్టివల్ సేల్స్‌కు రెడీ అయ్యాయి.
రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఇ–కామర్స్ సంస్థలు ఫెస్టివల్ సేల్స్‌కు రెడీ అయ్యాయి. షాపింగ్ లవర్స్ చాలామంది ఈ సేల్స్‌లో కొనుగోళ్లు చేస్తుంటారు. అయితే ఈ మెగా సేల్స్‌లో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డబ్బు మరింత ఆదా చేయొచ్చు!
ఫెస్టివల్ సేల్‌లో షాపింగ్ చేయాలనుకునేవాళ్లు నేరుగా యాప్స్‌లోకి వెళ్లి చెక్ చేయడం ద్వారా ఆకర్షనీయమైన ఆఫర్లకు టెంప్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అసలు మీకు ఏయే అవసరాలున్నాయి? ఏమేం కొనాలనుకుంటున్నారో ముందే నిర్ణయించుకుని షాపింగ్ చేస్తే మంచిది. కొనాలనుకుంటున్న వస్తువుల లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వాటిపై ఎందులో బెస్ట్ డీల్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఆఫర్ల మాయలో పడి అవసరంలేని వస్తువులు కొనుగోలు చేస్తే ఇ–కామర్స్ సంస్థల ట్రాప్‌లో చిక్కుకున్నట్టే.
బ్యాంక్ ఆఫర్లు
ఇలాంటి సేల్స్‌లో ఆఫర్లతో పాటు ప్రత్యేకంగా బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉంటాయి. వాటిని వాడుకుంటే మరింత డబ్బు సేవ్ చేయొచ్చు. కాబట్టి మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులను సరిగ్గా వాడుకునేందుకు ఇదే సరైన సమయం. అలాగే పాత మొబైల్స్, ల్యాప్ టాప్స్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసేందుకు కూడా ఈ సేల్ మంచి ఆప్షన్.
మెంబర్‌షిప్స్
ఫెస్టివల్ సేల్స్‌లో మరింత డిస్కౌంట్ పొందేందుకు, ప్రొడక్ట్ స్టాక్ అయ్యేలోపే కొనుగోలు చేసేందుకు ఆయా ప్లాట్‌ఫామ్స్‌లోని స్పెషల్ మెంబర్‌షిప్స్ పనికొస్తాయి. అమెజాన్‌లో ప్రైమ్ మెంబర్లకు, ఫ్లిప్‌కార్ట్‌లో ప్లస్ కస్టమర్లకు కొన్ని ప్రత్యేక బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి వీలుంటే వాటిని వాడుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్ లేకపోతే అవి ఉన్న ఫ్రెండ్స్ లేదా బంధువల సాయం తీసుకోవచ్చు.
టైమింగ్ ముఖ్యం
ఈ సేల్స్‌లో కొన్ని కొత్త మొబైల్స్ లాంఛ్ అవుతుంటాయి. అయితే అవి రిలీజ్ అయిన సెకండ్లలోనే స్టాక్ అయిపోవడం మనం చూస్తుంటాం. మళ్లీ అవి సేల్‌కి రావడానికి చాలా రోజులు పట్టొచ్చు. తర్వాత వాటిపై డిస్కౌంట్ ఉండకపోవచ్చు. కాబట్టి కొత్త మొబైల్స్ సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు వేగంగా షాపింగ్ చేయాలి. సరిగ్గా లాంఛింగ్ టైంకి యాప్‌లో రెడీగా ఉండాలి. పేమెంట్ మెథడ్స్, అడ్రెస్‌ను ముందుగానే సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇంటర్నెట్ స్పీడ్‌గా ఉండేలా చూసుకోవాలి.
వీటితోపాటు ఇ–కామర్స్ సైట్స్ సోషల్ మీడియా అకౌంట్స్, టెక్ ఇన్‌ఫ్లుయెన్సర్లను ఫాలో అవుతూ ఉండడం వల్ల లేటెస్ట్ డీల్స్ గురించి అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు.
Save Money,Festive Season,Amazon Great Indian Festival Sale,Amazon,Flipkart Big Billion Days Sale,Flipkart
Save Money, Festive Season, Amazon Great Indian Festival, Amazon, Online Shopping, flipkart big billion days sale, flipkart big billion days, Bank, Bank offers, ఫెస్టివల్ సేల్స్, షాపింగ్, డబ్బు ఆదా
https://www.teluguglobal.com//business/how-to-shop-save-money-during-festive-season-965816