ఫేస్ బుక్..

2023-02-24 07:10:38.0

https://www.teluguglobal.com/h-upload/2023/02/24/724353-facebook.webp

మనసు

ఉరకలు వేస్తుంటే..

తనువు

సహకరించనంటుంటే..

అదేనా వృద్ధాప్యం..

జ్ఞాపకాల సమాహారం..

స్పందించే మనసు

మాత్రమే ఉంది..

ఆలకించే

తోడు ఉండదు..

ఎడారిలో కోయిలలా..

ఎదురుచూపులేనా..

చిరు ఆశ

చిగురింప చేసి..

మాటలు నేర్పిన

నేస్తమై నిలిచింది..

ఆనందం

పంచుకుంటే..

అవధులు లేని సంబరం..

పుట్టినరోజు అనగానే

వెల్లువలా పారే

అభినందనలు..

అంతులేని ఆవేదనకు..

ఓదార్పుగా

పలికే మాటలు..

ఎవరో తెలియదు..

ఎక్కడి వారో

తెలుసుకోలేము..

మేమున్నామంటూ ..

మాటలతో

మనసుకు స్వాంతన ..

ఇక్కడ లేదు

మనకు కట్టడి..

అమ్మ ఒడిలా ఉంటుంది

స్నేహితుల దడి..

ఆలోచన ఏదైనా

అవుతుంది..

అచ్చతెలుగుకు

అక్షర రూపం..

తెలుగు భాషకు

అవుతోంది..

పట్టాభిషేకం..

రాయాలని పెంచే

పోటీ తత్వం..

ఆరోగ్యం మరిచి పోయాము..

ఆనందం పంచుకునే తత్వం…

ముఖపుస్తకమా…

తోడువైనావు..

మాకు ఆరోప్రాణమై

ఊపిరి పోసావు..

– జానకి వనం

Telugu Kavithalu,Facebook