ఫైరింగ్‌ ప్రాక్టీస్ చేస్తుండగా పేలుడు..ఇద్దరు హైదరాబాద్‌ అగ్నివీరుల మృతి

2024-10-12 09:27:35.0

ఫైరింగ్‌ ప్రాక్టీస్ చేస్తుండగా పేలుడు సంభంచడంతో హైదరాబాద్ కేంద్రానికి చెందిన ఇద్దరు అగ్నివీరులు మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు.

https://www.teluguglobal.com/h-upload/2024/10/12/1368414-aigini-ver.webp

మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఇద్దరు అగ్నివీరులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టిలరీ సెంటర్‌లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఇండియన్‌ ఫీల్డ్‌ గన్‌లోని షెల్‌ పేలడంతో దీంతో వారు తీవ్ర గాయాలతో మృతి చెందారని పోలీసులు తెలిపారు. ప్రాక్టీస్ సెషన్‌లో షెల్ మిస్ ఫైర్ కావడంతో గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), సెఫత్ షిత్ (21) తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే వారిని డియోలాలిలోని ఎంహెచ్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఆర్మీ హవల్దార్ అజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ అర్టిలరీ కేంద్రానికి చెందిన ఇద్దరు అగ్నివీరులు విశ్వరాజ్ సింగ్, సైఫత్ నాసిక్‌‌లో శిక్షణ పోందుతున్నారు.

Maharashtra Nashik District,Artillery Centre,Firing practice,fire fighters,Hyderabad,Indian army. bsf pm modi .