ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో హరీశ్‌రావు‌కు రిలీఫ్

2025-02-19 13:23:33.0

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు, రాధా కిషన్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది.

బీఆర్‌ఎస్ మాజీ మంత్రి మంత్రి హరీశ్‌రావుకు రాధా కిషన్‌రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చింది. పిటిషన్‌పై తదుపరి విచారణ మార్చి3 వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. పిటిషన్‌పై తదుపరి విచారణ చేపట్టే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని న్యాయస్థానం స్టే విధించింది. తన ఫోన్‌ ట్యాప్‌ చేశారంటూ రియల్టర్‌ చక్రధర్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ కేసులో హరీశ్‌రావు వద్ద గతంలో పనిచేసిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిని క్వాష్ చేయాలని హరీశ్‌రావు, రాధాకిషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.

phone tapping case,Former minister Harish Rao,Telangana High Court,Radha Kishan Rao,BRS Party,KCR,KTR,Latest Telugunews,Telugu News,CM Revanth reddy,Congress party,MLC Kavitha