https://www.teluguglobal.com/h-upload/2025/01/30/1398738-tg-high-court.webp
2025-01-30 06:03:34.0
రూ. లక్ష చొప్పున 2 ష్యూరిటీలు, పాస్‌పోర్టులు సమర్పించాలన్న ఉన్నత న్యాయస్థానం
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష చొప్పున 2 ష్యూరిటీలు, పాస్‌పోర్టులు సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు వారికి స్పష్టం చేసింది. ఇటీవలే సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తిరుపతన్నకు కూడా బెయిల్ మంజూరైంది.
Bhujanga Rao,Radhakishan Rao,Granted bail,In phone tapping case