ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్! ఆఫర్లు ఇవే..

https://www.teluguglobal.com/h-upload/2022/11/26/500x300_428160-flipkart-black-friday-sale-till-november-30.webp
2022-11-26 11:20:15.0

ఈ సేల్ నవంబర్ 30 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో మొబైళ్లు, ఇయర్ ఫోన్లు, గాడ్జెట్లు డిస్కౌంట్లతో కొనుగోలు చేయొచ్చు.

ఈ – కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రకటించింది. ఈ సేల్ నవంబర్ 30 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో మొబైళ్లు, ఇయర్ ఫోన్లు, గాడ్జెట్లు డిస్కౌంట్లతో కొనుగోలు చేయొచ్చు. ఈ సేల్‌లో ఉన్న మంచి డీల్స్ ఏంటంటే..

బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్13 రూ.62,999లకు డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో రూ.1,000 అదనపు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ సేల్‌లో నథింగ్ ఫోన్ రూ.27,499కే పొందొచ్చు. సేల్‌లో షావోమీ 11ఐ హైపర్ ఛార్జ్ ధర రూ.26,999 నుంచి రూ. 24,999 వరకూ ఉంది. అలాగే గూగుల్ పిక్సెల్ 6ఏ ధర రూ.30,999కి అందుబాటులో ఉంది. ఇక వీటితో పాటు రూ.60,000 ధర ఉన్న మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా.. సేల్‌లో భాగంగా రూ.54,999కే లభిస్తోంది.

యాపిల్ ఫస్ట్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ప్రో ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో రూ.19,999కి అందుబాటులో ఉన్నాయి.సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ రూ.26,600కి అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ పాడ్స్ 2 ధర రూ.11,999 ఉంది. సోనీ సీ500 ఇయర్‌ఫోన్స్ రూ.5,990కి లభిస్తున్నాయి. ఇంకా రకరకాల గాడ్జెట్లపై కూడా పలురకాల డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.

Flipkart,Black Friday Sale,Till November 30
Flipkart, Black Friday Sale, Till November 30

https://www.teluguglobal.com//business/flipkart-black-friday-sale-till-november-30-358265