https://www.teluguglobal.com/h-upload/2022/09/15/500x300_397672-flipkart-big-billion.webp
2022-09-15 10:50:14.0
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను అనౌన్స్ చేసింది. ఇందులో కస్టమర్లను ఆకర్షించడానికి మంచి డీల్స్ తీసుకురాబోతోంది. వాటిపై ఓ లుక్కేద్దామా..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను అనౌన్స్ చేసింది. ఇందులో కస్టమర్లను ఆకర్షించడానికి మంచి డీల్స్ తీసుకురాబోతోంది. వాటిపై ఓ లుక్కేద్దామా..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి మొదలుకానుంది. ఈ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 6ఏ, ఒప్పో రెనో 8, నథింగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది.అలాగే ఈ సేల్ లో ఐకూ జెడ్ 6 లైట్ మొబైల్ రూ.15వేల లోపు ధరకే లభిస్తుంది. అలాగే ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా లభించనుంది.
ప్రస్తుతం ఐఫోన్ 13 ధర రూ. 69,900, ఐఫోన్ 13 ప్రో ధర రూ. 1,19,900, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,26,000. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 12 మినీని రూ.39,990కి, ఐఫోన్ 11ని రూ.29,990కి లభిస్తుంది. ఈ సేల్‌లో నథింగ్ ఫోన్ 1ని రూ. 27,699కి కొనుగోలు చేయొచ్చు.
ఇకపోతే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ధర రూ. 14,999గా ఉండబోతోంది. రియల్ మీ నార్జో 50 బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో కలిపి సుమారు రూ. 10,999 కే లభించనుంది. అలాగే ఐఫోన్ 13.. రూ. 49,990 కే లభిస్తుంది. మిగతా ఐఫోన్లపై కూడా బ్యాంక్ ఆఫర్లు వర్తిస్తాయి. అలాగే యాపిల్ యూజర్లు కొత్త ఐఫోన్ కొనాలనుకుంటే పాత ఐ ఫోన్ ను ఎక్స్ ఛేంజ్ చేసుకోవచ్చు.
ఈ సేల్‌లో ఒప్పో రెనో 8 5జీ ధర రూ. 26,999కి తగ్గింది. మోటో జీ52 ధర రూ. 12,599కి అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా ఈ సేల్ లో గూగుల్ పిక్సెల్ 6ఏ పై ఏకంగా రూ. 16,300 డిస్కౌంట్ లభిస్తోంది.
ఇదిలా ఉంటే మరో పక్క అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఇందులో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు ఎస్ బీఐ క్రెడిట్ కార్డుపై బ్యాంక్ ఆఫర్లు ఉండబోతున్నాయి.
Flipkart Big Billion Days,Flipkart
Flipkart, Flipkart Big Billion Days 2022, Flipkart Big Billion Days 2022 sale, Flipkart Big Billion Days 2022 offers, Flipkart Big Billion Days 2022 deals, Big Billion Days sale, telugu, telugu news, telugu global news, telugu global latest news, latest news, latest telugu news today, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బిలియన్ డేస్
https://www.teluguglobal.com//business/flipkart-big-billion-days-2022-these-are-the-best-deals-on-flipkart-big-billion-days-sale-342667