ఫ్లిప్‌కార్డ్ ఇయర్ ఎండ్ సేల్! ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి!

https://www.teluguglobal.com/h-upload/2022/12/27/500x300_432933-flipkart.webp
2022-12-27 21:49:44.0

Flipkart Year End Sale 2022 Offer: ఈ ఏడాది ముగింపు సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు, గాడ్జెట్లపై మంచి ఆఫర్లు ప్రకటించింది.

ఈ ఏడాది ముగింపు సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు, గాడ్జెట్లపై మంచి ఆఫర్లు ప్రకటించింది. వాటిలో కొన్ని బెస్ట్ డీల్స్ ఇవి..

ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 13 మోడల్ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 61,999 గా ఉంది. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22+ మోడల్ రూ. 69,999 డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఉంది. గెలాక్సీ ఎస్ 22+ వేగవంతమైన పర్ఫార్మెన్స్‌తో పాటు అద్భుతమైన కెమెరా ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇది శాంసంగ్ నుంచి వచ్చిన బెస్ట్ ఫ్లాగ్ షిప్ మొబైల్‌గా చెప్పుకోవచ్చు.

ఈ ఏడాది రిలీజైన గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్ ధర రూ. 43,999గా ఉంటే.. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా రూ.29,999కే లభిస్తోంది. ఇందులో లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌తో పాటు క్లీన్ యూఐ ఉంటుది. అలాగే మంచి బ్యాటరీ, అద్భుతమైన కెమెరాలు ఉన్నాయి.

మార్కెట్లో రూ. 30,000కి లాంచ్ అయిన మోటో ఎడ్జ్ 30.. ఈ సేల్‌లో భాగంగా రూ. 22,999కే అందుబాటులో ఉంది. ఇదొక బెస్ట్ ఆల్ రౌండర్ 5జీ స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు.

ఇక వీటితో పాటు రెడ్ మీ, పోకో, ఇన్ఫినిక్స్ మొబైల్స్‌పై కూడా మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. శాంసంగ్ ఎఫ్ 23 కూడా తక్కవ ధరకే లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ బడ్స్2.. రూ. 6,894కే డిస్కౌంట్ ధరతో లభిస్తుంది.

Year Ender 2022,Flipkart,Flipkart offers,Smartphones
Year End, Year End 2022, Flipkart Sale,flipkart, apple, bank of baroda, redmi note, moto, redmi, credit card emi,bank of baroda,icici bank, Flipkart Year End Sale 2022 Offer

https://www.teluguglobal.com//business/flipkart-year-end-sale-2022-top-offers-and-discounts-on-smartphones-553779