బంగ్లాలో హిందువులపై దాడులను నిరసిస్తూ రేపు నిరసనలు

2024-11-29 15:29:11.0

దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో నిర్వహించాలని వీహెచ్‌పీ పిలుపు

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ శనివారం దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్‌ పిలుపునిచ్చింది. నిరసనలో భాగంగా మానవహారాలు నిర్మించి బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింసాఖాండను ఖండించాలని కోరింది. ఇస్కాన్‌ సంస్థ ప్రతినిధి చిన్మయ్‌ కృష్ణదాస్‌ ను వెంటనే విడుదల చేయాలని, బంగ్లాదేశ్‌లో మైనార్టీలయిన హిందువులకు అక్కడి ప్రభుత్వం రక్షణ కల్పించాలని వీహెచ్‌పీ కోరింది. ఇస్లామిక్‌ మతోన్మాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది.

Bangladesh,Attacks on Hindus,Protest,VHP