బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

https://www.teluguglobal.com/h-upload/2024/11/01/1374135-car-accident.webp

2024-11-01 03:54:16.0

కేబీఆర్‌ ఫుట్‌ పాత్‌ దాటి ప్రహరీ గోడ గ్రిల్స్‌ ధ్వంసం చేసిన నంబర్‌ ప్లేట్‌ లేని కారు

హైదరాబాద్‌ బెంజ్‌ కారు బీభత్సం సృష్టించింది. కేబీఆర్‌ ఫుట్‌ పాత్‌ దాటి ప్రహరీ గోడ గ్రిల్స్‌ ధ్వంసం చేసుకుంటూ చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఎయిర్‌ బెలున్స్‌ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ కారు వదిలి పరారయ్యాడు. బెంజ్‌ కారు నంబర్‌ లేకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫుట్‌పాత్‌పై ఉన్న రోగులు, వారి సహాయకులు, నిరాశ్రయులు ప్రాణభయంతో పరుగులు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు.

Car panic,Banjara Hills,KBR footpath,Grilles destroyed