2025-02-11 04:17:28.0
శనివారం నాటికి బందీలందరినీ విడుదల చేయకపోలే.. నరకం చూపిస్తానంటూ హెచ్చరిక
గాజా కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తున్నదని ఆరోపిస్తూ.. తదుపరి బందీల విడుదల ఆలస్యం చేస్తామని హమాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బందీలపై విడుదలపై హమాస్‌కు డెడ్‌లైన్ విధించారు. శనివారం నాటికి బందీలందరినీ విడుదల చేయకపోలే.. నరకం చూపిస్తానంటూ హెచ్చరించారు. ఓవెల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హమాస్ చర్య భయంకరమైనది. కాల్పుల విరమణ విషయంలో అంతిమంగా ఏం జరగాలనేది ఇజ్రాయెల్ నిర్ణయం. కానీ నాకు సంబంధించినంత వరకు శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు బందీలందరినీ విడుదల చేయాలి. లేకపోతే నరకం ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటాయి. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు పిలుపునిస్తా. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో మాట్లాడుతానని ట్రంప్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. గాజాను స్వాధీనం చేసుకుని పునర్ నిర్మిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించిన విషయం విదితమే. దీనికి పాలస్తీనియన్లు నిరాకరిస్తే మిత్రదేశాలైన జోర్డాన్, ఈజిప్ట్‌లకు అందించే సహాయాన్ని నిలిపివేస్తానని ఆయన హెచ్చరించారు. ఓ విలకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈవిధంగా బదులిచ్చారు. ఇక ఈ వారంలో ట్రంప్‌తో జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 భేటీ కానున్నట్లు పలు వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
Trump issues,Ultimatum to Hamas,On hostage release,Threatening fragile ceasefire,Benjamin Netanyahu