2024-11-11 04:30:02.0
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
https://www.teluguglobal.com/h-upload/2024/11/11/1376670-babu.webp
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నిర్వహించారు. ఇందులో 2024-25 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. మంత్రులు నారా లోకేశ్, నారాయణ, పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవిత, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళి అర్పించారు. రాజధాని రైతులను మంత్రి నారా లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు. అమరావతి ఉద్యమంలో కీలకపాత్ర పోషించారంటూ అభినందించారు. సూపర్ సిక్స్ హామీలు నెవవేర్చే దిశగా బడ్జెట్ ఉంటుందని టీడీపీ నేతలు తెలిపారు.