బన్నీ అరెస్ట్‌పై హీరో నాని ఫైర్

 

2024-12-13 12:06:11.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/13/1385595-nani.webp

అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై రేవంత్ సర్కార్‌పై హీరో నాని ఆగ్రహం వ్యక్తం చేశారు

అల్లు అర్జున్ అరెస్ట్‌పై హీరో నాని ఫైర్‌య్యారు. సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సహం సాధారణ పౌరులకు కూడా ఉండాలని కోరుకుంటున్నాయని అల్లు అర్జున్‌ని అరెస్టు చేయడం నిజంగా దురదృష్టకరం నాని అన్నారు. తొక్కిసలాట ఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్తగా ఉండేందుకు.. సంధ్య థియేటర్ ఘటన ఒక గుణపాఠం అని తెలిపారు.

ఏది ఏమైనా.. ఆ ఘటనకు కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే బాధ్యుడు కాదు అంటూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్నికి నాచురల్ స్టార్ చురకలు అంటించారు ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే, ఈ ఘటనలో అందరి తప్పు ఉందని, ఒకరినే బాధ్యుడిగా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాగా, అల్లు అర్జున్ అరెస్ట్‌ను పలువురు సినీ ప్రముఖులు ఖండించారు.

 

Hero Nani,Allu Arjun,Icon star Allu Arjun,Megastar Chiranjeevi,Chikkadapally Police Station,Pushpa-2 movie release,Sandhya Theatre,Gandhi Hospital,Nampally Criminal Court,CM Revanth reddy,Chanchalguda Jail,Nampally Court