http://www.teluguglobal.com/wp-content/uploads/2016/04/masala.gif
2016-04-28 04:18:47.0
మన ఆహారంలో రుచిని ఘాటుని పెంచే మసాలాలు చాలా ఉన్నాయి. వీటివలన రుచే కాదు, ఆరోగ్యమూ పెరుగుతుంది. ఆ వివరాలు ఇవి- దాల్చిన చెక్క శరీరంలో షుగర్స్థాయిని సమతుల్యంలో ఉంచుతుంది. శరీరంలో జీవక్రియలను వేగవంతం చేస్తుంది. కొవ్వుని కరిగిస్తుంది. అల్లం శరీరంలో అదనంగా ఉన్న కొవ్వుని తగ్గిస్తుంది. విషాలను తొలగిస్తుంది. తద్వారా శరీర బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. యాలకులు కూడా కొవ్వుని కరిగించి బరువుని తగ్గిస్తాయి. పసుపు కొవ్వు కణాల ఉత్పత్తిని తగ్గించి శరీరం బరువు […]
మన ఆహారంలో రుచిని ఘాటుని పెంచే మసాలాలు చాలా ఉన్నాయి. వీటివలన రుచే కాదు, ఆరోగ్యమూ పెరుగుతుంది. ఆ వివరాలు ఇవి-
- దాల్చిన చెక్క శరీరంలో షుగర్స్థాయిని సమతుల్యంలో ఉంచుతుంది. శరీరంలో జీవక్రియలను వేగవంతం చేస్తుంది. కొవ్వుని కరిగిస్తుంది.
- అల్లం శరీరంలో అదనంగా ఉన్న కొవ్వుని తగ్గిస్తుంది. విషాలను తొలగిస్తుంది. తద్వారా శరీర బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.
- యాలకులు కూడా కొవ్వుని కరిగించి బరువుని తగ్గిస్తాయి.
- పసుపు కొవ్వు కణాల ఉత్పత్తిని తగ్గించి శరీరం బరువు పెరగకుండా నివారిస్తుంది.
- మిరపకాయల్లో ఉన్న క్యాప్సకిన్ అనే పదార్థం కొవ్వు పెరగకుండా చేస్తుంది. త్వరగా ఆకలివేయటం అనే సమస్యని నివారిస్తుంది.
- జీలకర్ర జీర్ణవ్యవస్థని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. శరీరం నుంచి వృథాలు. విషాలను బయటకు పంపుతుంది. దాంతో బరువు అదుపులో ఉంటుంది.
- నల్ల మిరియాలు మెటబాలిజం రేటుని పెంచుతాయి. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తాయి…తద్వారా బరువుని అదుపులో ఉంచుతాయి.
- అవిసె గింజలతో తయారైన స్నాక్స్ తీసుకుంటే పొట్ట నిండుగా ఉన్నట్టుగా ఉంటుంది.
- గోరుచిక్కుడు శరీరంలో షుగర్ స్థాయిని తగ్గిస్తాయి. జీర్ణక్రియని వేగవంతం చేస్తాయి.
- మెంతిపొడి మెటబాలిజం రేటుని పెంచి శరీరం బరువుని తగ్గిస్తుంది.
- సోపు గింజలు అరుగుదలకు పనిచేస్తాయి. వీటివాసన ఒత్తిడిని తగ్గిస్తుంది.
masala powder
https://www.teluguglobal.com//2016/04/28/masala-powder/