https://www.teluguglobal.com/h-upload/2022/12/20/500x300_432030-weight-loss.webp
2022-12-20 12:39:56.0
బరువు తగ్గాలని చాలామంది కోరుకుంటారు. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ, కొంతమంది మాత్రమే అనుకున్నది సాధించగలుగుతారు. దానికి కారణం బరువు తగ్గడానికి కొన్ని నియమాలున్నాయి.
బరువు తగ్గాలని చాలామంది కోరుకుంటారు. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ, కొంతమంది మాత్రమే అనుకున్నది సాధించగలుగుతారు. దానికి కారణం బరువు తగ్గడానికి కొన్ని నియమాలున్నాయి. అవి తు.చ. తప్పకుండా పాటిస్తేనే గోల్ రీచ్ అవుతారు. లేకపోతే బరువు తగ్గడం కష్టంగా మారుతుంది.
బరువు పెరగడం వల్ల డయాబెటిస్, బీపీ, ఒత్తిడి లాంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ బరువు తగ్గడం మరింత కష్టమవుతుంది. అందుకే బరువును అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. బరువు తగ్గించుకోడానికి ముఖ్యంగా మూడు నియమాలను గుర్తుంచుకోవాలి.
వాటిలో మొదటిది మోటివేటెడ్ గా ఉండడం. బరువు తగ్గాలి అనుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. లైఫ్‌స్టైల్ మార్పులను క్రమం తప్పకుండా పాటించాలి. కొవ్వులు, ఎక్కువ క్యాలరీలు తీసుకోవడాన్ని తగ్గించాలి. నిద్రపోయే సమయం, నిద్ర లేచే సమయం, తినే సమయాలు చెక్ చేసుకోవాలి. జంక్ ఫుడ్, ఆల్కహాల్ ముట్టుకోకూడదని రూల్ పెట్టుకోవాలి.
ఇక రెండో నియమం డైట్. ముందు రోజువారీ లైఫ్‌స్టైల్‌ను టైంటేబుల్ ప్రకారం సరి చేసుకోవాలి. ఆ తర్వాత భోజనం ప్లేట్‌ను సరిచేయాలి. తినే ఫుడ్‌లో కూరగాయలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, మాంసాహారులైతే చికెన్, చేపల వంటివన్నీ సమపాళ్లలో తీసుకోవాలి. రోజూ తీసుకునే దానికంటే మూడో వంతు తగ్గించాలి. సాయంత్రం ఏడు గంటల కంటే ముందే డిన్నర్ పూర్తి చేయాలి. మితంగా తినేలా చూసుకోవాలి. స్నాక్స్ తగ్గించాలి. ఆహారాన్ని నములుతూ, ఆస్వాదిస్తూ తినాలి. ఆహారానికి గంట ముందు గంట తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి.
బరువు తగ్గేందుకు పాటించాల్సిన మూడో నియమం శారీరక శ్రమ. మొదటి రెండు నియమాలు పాటిస్తే లైఫ్‌స్టైల్ కంట్రోల్‌లోకి వస్తుంది. బరువు పెరగకుండా చూసుకునేందుకు ఆ రెండు నియమాలు పనికొస్తాయి. అయితే పెరిగిన బరువుని తగ్గించాలంటే కొవ్వు కరిగించాల్సిందే. అందుకే రోజూ కనీసం 20 నిముషాల పాటైనా రొప్పు వచ్చేలా, చెమటలు పట్టేలా.. జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్, రన్నింగ్, ఇతర కార్డియో వ్యాయామాలు చేయాలి.
వీటితో కేలరీలు ఖర్చవుతాయి. అదనంగా పెరిగిన కొవ్వు కరుగుతుంది. ఈ మూడు నియమాలు మైండ్‌లో ఉంచుకుంటే ఎలాంటి వారికైనా బరువు తగ్గడం వీలవుతుంది. అయితే తొందరగా తగ్గాలి అని కంగారు పడడం కంటే ఓపిగ్గా ఉంటూ.. ఎక్కువ సమయం తీసుకుని బరువు తగ్గడమే మేలు అని గుర్తుంచుకోవాలి.
Weight Loss Tips in Telugu,weight loss,Health Tips
Weight loss tips in Telugu, Weight loss, Weight Loss Tips, How To Lose Weight Fast, Lose Weight Quickly, Best Weight Loss Tip, Weight Loss Diet, Cardio, Strength Training, Macros, Counting Calories, Best Cardio For Weight Loss, Best Strength Training Exercise For Weight Loss, బరువు, బరువు తగ్గడానికి, కార్డియో వ్యాయామాలు చేయాలి
https://www.teluguglobal.com//health-life-style/weight-loss-tips-in-telugu-you-need-to-do-these-three-things-to-lose-weight-consistently-553269