https://www.teluguglobal.com/h-upload/2023/11/08/500x300_853103-banana-diet.webp
2023-11-08 09:50:56.0
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్‌గా బరువు తగ్గించే డైట్ ప్లాన్‌లలో జపనీస్ ఆసా బనానా డైట్ కూడా ఒకటి.
ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఒబెసిటీ ఒకటి. ఒబెసిటీని తగ్గించుకోవడం కోసం రకరకాల డైట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వెయిట్ లాస్ కోసం జపనీస్ ఫాలో అవుతున్న కొత్త రకం డైట్ ఒకటి ఇప్పుడు తెగ పాపులర్ అవుతోంది. అదే ‘ఆసా బనానా డైట్’. ఇదెలా ఉంటుందంటే.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్‌గా బరువు తగ్గించే డైట్ ప్లాన్‌లలో జపనీస్ ఆసా బనానా డైట్ కూడా ఒకటి. దీన్నే ‘జపనీస్ మార్నింగ్ బనానా డైట్’ అంటారు. ఈ డైట్ తో కేవలం బరువు తగ్గడమే కాదు, పూర్తి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ డైట్‌లో ఖచ్చితమైన క్యాలరీల లెక్కలు ఏమీ లేవు. కొన్ని సింపుల్ రూల్స్ ఫాలో అవ్వాలి అంతే. ఈ డైట్ ఎలా పాటించాలో ఇప్పుడు చూద్దాం.
ఆసా బనానా డైట్‌ను సుమికొ వటనాబె, హమాచీ అనే జపనీస్ దంపతులు ఇంట్రడ్యూస్ చేశారు. జపనీస్ ఆసా బనానా డైట్‌లో పొద్దున్నే అరటిపండు తినాలి. అలాగే తగినంత నీరు తాగాలి. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కింద అరటిపండు తిన్న తర్వాత లంచ్ వరకూ మరేదీ తినకూడదు. మరీ ఆకలిగా జ్యూస్ వంటివి తీసుకోవచ్చు. ఇక లంచ్, డిన్నర్‌లో భాగంగా చాలా మితమైన ఆహారాన్ని తీసుకోవాలి. డిన్నర్ రాత్రి 7 గంటల లోపు పూర్తి చేయాలి. రోజులో ఎలాంటి షుగర్ కంటెంట్ తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్, ఇతర జంక్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. లంచ్, డిన్నర్ చేసేటప్పుడు కడుపు 70 శాతం నిండగానే ఆపేయాలి. ఇదే జపనీస్ బనానా డైట్.
అరటిపండుని బ్రేక్ ఫాస్ట్ గా తినడం ద్వారా అతిగా తినే అలవాటు తగ్గుతుందని డైట్ ప్లానర్స్ చెప్తున్నారు. పొద్దున్నే అరటిపండు తినడం ద్వారా శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. శరీరం తేలికగా అనిపించడంతోపాటు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అరటిపండులో శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్.. కడుపు నిండిన భావన కలిగించడంతోపాటు ఆకలిని కంట్రోల్ చేస్తుంది.
సాయంత్రం ఏడు లోపు డిన్నర్ ముగించడం ద్వారా బరువు తగ్గడం మరింత సులభతరం అవుతుంది. షుగర్ కంటెంట్‌ను పూర్తిగా కట్ చేయడం ద్వారా అదనంగా బరువు పెరిగే అవకాశం ఉండదు. ఇక మీల్స్‌లో భాగంగా సాధారణ ఆహారాన్ని తీసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని తేలికపాటి వెయిట్ లాస్ ప్లాన్ ఇది.
Banana Diet,Weight Loss Tips in Telugu,Weight Loss,Health Tips,Banana,Obesity,Japanese Banana Diet
Banana Diet, weight loss, weight loss tips, weight loss tips in telugu, telugu weight loss tips, health news, health tips, telugu health tips, Banana, Obesity, Japanese Asa Banana Diet, Japanese Banana Diet, బనానా డైట్, బరువు తగ్గించే డైట్ ప్లాన్, జపనీస్ ఆసా బనానా డైట్
https://www.teluguglobal.com//health-life-style/do-you-know-about-banana-diet-for-weight-loss-972879