బ‌ర్డ్‌ఫ్లూ క‌ల‌క‌లం.. అప్ర‌మ‌త్త‌మైన తెలంగాణ సర్కార్

2025-02-15 15:08:17.0

బ‌ర్డ్‌ఫ్లూ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నాది

బ‌ర్డ్‌ఫ్లూ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పశు వైద్య, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ బి గోపి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బర్డ్‌ఫ్లూ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు విస్తృత కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు పశు వైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 9100797300 వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ తమ పరిసర ప్రాంతాలలో, చుట్టుప్రక్కల ఎక్కడనైన విపరీతంగా పక్షులు చనిపోతే, వాట్సాప్ నెంబర్ 9100787300కు సమాచారాన్ని తెలుపాల‌ని ఆయన ప్రజలను కోరారు.

Birdflu,Telangana government,Department of Animal Husbandry,CM Revanth Reddy,KCR,KTR,BRS Party,BJP