బర్డ్ ప్లూ ఎఫెక్ట్‌తో వెల వెలబోతున్న చికెన్ షాపులు..కేజీ ఎంతంటే?

2025-02-16 05:06:19.0

తెలంగాణలో భారీగా చికెన్‌ విక్రయాలు తగ్గాయి. ఆదివారం అయినప్పటికీ చికెన్ మార్కెట్ వెలవెలబోతుంది.

బర్డ్ ప్లూ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో భారీగా చికెన్‌ విక్రయాలు తగ్గాయి. ఇవాళ సండే అయినప్పటికీ చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. చికెన్ ధర తగ్గిపోయింది.ప్రస్తుతం చాలా మార్కెట్లలో చికెన్ ధర కేజీ 180 రూపాయలుగా ఉంది. గత 15 రోజులుగా పరిశీలిస్తే 220 నుండి ప్రస్తుతం 150 రూపాయలకు ధర పడిపోయింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్ కు వచ్చే కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. అదే సమయంలో….రెండు తెలుగు రాష్ట్రా లైన ఏపీ అలాగే తెలంగాణలో మటన్‌ కు డిమాండ్‌ పెరిగింది. ఎక్కువ మంది మటన్‌ తింటున్నారు. దీంతో.. కిలో మటన్‌ రూ.900 అమ్ముతున్నారు. దీంతో మాంసపు ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్. వైరస్ సోకిన కోళ్లను తినద్దొని, సోకని చికెన్‌ను 70-100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏపీ తెలంగాణ పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నాణ్యతగా లేని చికెన్ విక్రయిస్తున్న వ్యాపారులపై ఫుడ్ సేఫ్టే విభాగం కొరడాను ఝులిపిస్తోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా వ్యాపారుల ధోరణి మారకపోవడంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మరోవైపు పలు షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా బయటపడినట్లు తెలిసింది. సుమారుగా 500 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్‌ను చూసి అధికారులు షాక్ అయ్యారు. వ్యాపారులపై కేసు నమోదు చేసిన అధికారులు.. కుళ్లిన చికెన్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Bird Flu,Telangana,Chicken Shops,Telangana Goverment,Food Safety Officials,Chicken Rates,Fish markets,CM Revanth reddy,Telangana goverment,Hyderabad,Vijayawada