బలవన్మరణానికి పాల్పడిన ప్రేమ జంట

https://www.teluguglobal.com/h-upload/2024/10/18/1370154-suicide.webp

2024-10-18 06:36:15.0

పెళ్లికి పెద్దలు నిరాకరించారని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నయువతి, యువకుడు

గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. యువతి, యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెదకాకాని వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నది. మృతులను దానబోయిన మహేశ్‌, నండ్రు శైలజగా గుర్తించారు.

పెదకాకాని గ్రామానికి చెందిన మహేశ్‌, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలజ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. డిప్లొమా చదివిన మహేశ్‌.. రెండేళ్ల కిందట హైదరాబాద్‌లో ఓ మొబైల్‌ స్టోర్‌లో పనిచేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న శైలజతో ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. 10 రోజుల కిందట యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. కానీ యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. దసరా సమయంలో శైలజ, మహేశ్‌ ఇంట్లో చెప్పకుండా బైటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై విగత జీవులుగా కనిపించారు. 

love couple,committed,suicide,Guntur District,Pedakakani village